Yerragondapalem: చింతల ఆశ్రమ పాఠశాలలో వైభవంగా 'ప్రపంచ ఆదివాసీ దినోత్సవం'!
Yerragondapalem: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం చింతల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది.
Yerragondapalem: చింతల ఆశ్రమ పాఠశాలలో వైభవంగా 'ప్రపంచ ఆదివాసీ దినోత్సవం'!
యర్రగొండపాలెం: శ్రీశైలం ప్రాజెక్టుఅధికారి (సుండీపెంట) చూచనలమేరకు చింతల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంచార్జ్ హెడ్‌మాస్టర్ మానికల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చింతల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా గిరిజనులు సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా నిర్వహించిన నృత్యాలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న నిర్వహిస్తారు. ఆదివాసీ ప్రజల హక్కులు, వారి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానాలను పరిరక్షించడం, వారి అభివృద్ధి కోసం సమాజంలో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. తరతరాలుగా ప్రకృతి పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆదివాసీ సమాజాల సంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఇంచార్జ్ హెడ్‌మాస్టర్ శ్రీనివాసరావుతో పాటు ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది వెంకటేశ్వర్లు, వెంకయ్య, సుబ్బమ్మ, పాఠశాల సిబ్బంది భూమిని మంతమ్మ, కేపీసీ నాయక్, వెంకటేశ్వర్లు, కటికల బాబు, చింతల వేటీడీఏ మాజీ అధ్యక్షుడు పోతన్న, చింతల గ్రామస్తులు, గిరిజనులు తదితరులు విరివిగా పాల్గొన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.




