Markapuram: వెలుగొండ ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పెషల్ ఫోకస్!

Markapuram: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించనున్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.

Srikanth Singam, Markapur
Published on: 16 Jun 2026 8:27 AM IST
Markapuram
X

Markapuram: వెలుగొండ ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పెషల్ ఫోకస్!

మార్కాపురం జిల్లా: పెద్ద దోర్నాలలో వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న మంత్రి నిమ్మల రామానాయుడు. మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండల పరిధిలోని శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు వద్ద రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు రెండవ సొరంగం లైనింగ్ పనులతో పాటు టీబీఎం (Tunnel Boring Machine) యంత్రం తొలగింపు కార్యక్రమాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనాలు అందించేందుకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story