Banaganapalle: అవుకు రిజర్వాయర్‌కు ఎస్సార్‌బీసీ ద్వారా వారం రోజులు నీరు!

Banaganapalle: అవుకు రిజర్వాయర్‌కు ఎస్సార్‌బీసీ నీటి విడుదలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటన. వారం రోజులే నీరు, రైతులకు కీలక విజ్ఞప్తి.

Ramanaiah, Banaganepalle
Published on: 29 Aug 2026 6:56 PM IST
Banaganapalle
X

Banaganapalle: అవుకు రిజర్వాయర్‌కు ఎస్సార్‌బీసీ ద్వారా వారం రోజులు నీరు!

Banaganapalle: నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ కు ఎస్ఆర్బిసి ద్వారా వారం రోజుల పాటు నీరు విడుదల చేస్తాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ఎస్సార్ బీసీ అధికారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించిన మంత్రి.

గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్ఆర్బిసి ద్వారా అవుకు రిజర్వాయర్ కు రేపటి నుంచి నీరు విడుదల చేస్తాం, స్థానికంగా ఉన్న పరిస్థితులను సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులకు వివరించాం. మా విన్నపం మేరకు ఎస్ ఆర్ బి సి ద్వారా నీరు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపిన సీఎం చంద్రబాబు, ప్రభుత్వానికి బనగానపల్లె నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు. నేడు ప్రతి గ్రామంలో బోర్లు ఎండిపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, పశువులకు కూడా నీళ్లు లేకుండా పోయిన పరిస్థితి, ఇప్పటికే అవుకు రిజర్వాయర్ కు జి ఎన్ ఎస్ ఎస్ నుంచి నీళ్లు తీసుకు వెళుతున్నాం.

అదే ఎస్ఆర్బిసి ద్వారా ఒక వారం పాటు తీసుకెళ్తే కాలువ వెంబడి ఉన్న వాగులు, వంకలతో పాటు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి, బోర్లు తిరిగి రీఛార్జ్ అవుతాయని విషయం ప్రభుత్వానికి విన్నవించాం. ఎస్ ఆర్ బీసీ ద్వారా నీళ్లు వస్తే రైతులు మళ్లీ పంటలు వేసి నష్టపోతారని ఆందోళన ప్రభుత్వంలో ఉంది. పశువులు, తాగునీటి కోసం నీరు విడుదల చేస్తున్న విషయం ఇప్పటికే స్థానిక రైతులకు వివరించాం.

రేపు సాయంత్రం నుంచి ఒక వారం రోజులు పాటు ఎస్ఆర్బిసి ద్వారా నీటిని విడుదల చేయాలని నిర్ణయించాం, ఎస్సార్ బీసీలో నీళ్లు వస్తున్నాయని ఆశపడి రైతులు పంటలు వేసుకుంటే నష్టపోతారుదయచేసి రైతులు పంటలు వేసుకోవద్దని విన్నవించుకుంటున్నాం.

ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి వచ్చే కొద్దిపాటి నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది, వారం రోజులు మాత్రమే నీరు వస్తుంది... ఈ విషయాన్ని గ్రహించి దయచేసి పంటలు వేసుకోకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

స్థానికంగా క్షేత్రస్థాయిలో గ్రామాల పరిస్థితి చూసి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం రైతుల పట్ల సదుద్దేశంతో ఉంది.. గతంలో సైతం మే, జూన్ నెలలో కూడా రైతులు వద్దనే వరకు సాగునీరు అందించాం.

స్థానికంగా ప్రజలు రైతులకు ఇక్కడి సమస్యలపై అవగాహన ఉంది. కొంతమంది అనవసరంగా ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు పనిచేస్తున్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story