Kurnool: ఢిల్లీ వేదికగా విద్యార్థి లోకం గర్జన ఛలో ఢిల్లీ పోస్టర్ లాంచ్

Kurnool: ఆగస్టు 5, 6 తేదీల్లో నిర్వహించనున్న "ఛలో ఢిల్లీ" కార్యక్రమ కరపత్రాలను కర్నూలులో విద్యార్థి సంఘాల నేతలు విడుదల చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 18 July 2026 7:27 PM IST
Kurnool
X

Kurnool: ఢిల్లీ వేదికగా విద్యార్థి లోకం గర్జన ఛలో ఢిల్లీ పోస్టర్ లాంచ్

కర్నూలు: దేశవ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు, అవసరమైన సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆగస్టు 5, 6 తేదీల్లో "ఛలో ఢిల్లీ" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వ విద్యార్థి సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పగడాల ఆనంద్ బాబు తెలిపారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను బిర్లా కాంపౌండ్‌లోని కార్యాలయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు భరత్ కుమార్ అధ్యక్షతన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆనంద్ బాబు, భరత్ కుమార్ మాట్లాడుతూ, విద్యారంగ సమస్యలు, విద్యా సంస్కరణలకు సంబంధించిన వినతిపత్రాలను కేంద్ర మంత్రులకు అందజేసేందుకు "ఛలో ఢిల్లీ" కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య, నవ్యాంధ్ర విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపోగు రాజన్న, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి అధ్యక్షుడు రవి కుమార్, రాయలసీమ యువజన పోరాట సమితి అధ్యక్షుడు వి.వి. నాయుడు, రాయలసీమ విద్యార్థి జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, APSF జిల్లా అధ్యక్షుడు ఎద్దుపెంట అంజి, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, వడ్డెర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు, విద్యార్థి నాయకులు రాము యాదవ్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story