Kurnool: పెద్దపడకాన గ్రామంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు!
Kurnool: కర్నూలు జిల్లా పెద్దపడకానలో వైభవంగా వినాయక చవితి వేడుకలు. వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ కురువ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.
Kurnool: పెద్దపడకాన గ్రామంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు!
Kurnool: కర్నూలు జిల్లా పెద్దపడకాన గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు, యువత, పెద్దలు, చిన్నపిల్లలు కుల మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు.పెద్దపడకాన గ్రామ ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రతి ఒక్కరూ అరిష్టాలు తొలగి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించారు. అలాగే ప్రతి ఒక్కరూ సమాజం కోసం, పెద్దపడకాన గ్రామ అభివృద్ధి కోసం, కర్నూలు ప్రాంత అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు.
యువత విద్యపై ప్రత్యేక దృష్టి సాధించి విద్యను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని, స్వయం ఉపాధి అవకాశాలను పెంచుకుని మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా పెద్దపడకాన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కురువ శివరాం ప్రసాద్, 8 వార్డు, వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.




