Markapuram: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ పనుల్లో ప్రమాదం యువకుడు మృతి!

Markapuram: వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ పనుల్లో దారుణ ప్రమాదం. యంత్రం కిందపడి యూపీకి చెందిన యువకుడు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెద్దదోర్నాల పోలీసులు.

Srikanth Singam, Markapur
Published on: 17 Aug 2026 8:13 AM IST
Markapuram
X

Markapuram: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ పనుల్లో ప్రమాదం యువకుడు మృతి!

Markapuram: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం కొత్తూరు గ్రామం వద్ద గల వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్‌లో టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగింపు పనుల్లో విషాదం చోటుచేసుకుంది. యూపీఎస్‌కు చెందిన మార్టిరాల్ (18) టన్నెల్ పనుల్లో 9.8 కిలోమీటర్ వద్ద పనులు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు.

హైడ్రా మిషన్ రిపర్స్‌లో ఉన్న మోతి లాల్ ను తొక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పెద్దదోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story