Markapur: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల తరలింపుపై కలెక్టర్ సమీక్ష!

Markapur: ఆగస్టు 22న వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల ట్రయల్ రన్ నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజల తరలింపు ప్రక్రియపై మార్కాపురం కలెక్టర్ ఎం. విజయ సునీత సమీక్ష నిర్వహించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 12 Aug 2026 4:45 PM IST
Markapur
X

Markapur: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల తరలింపుపై కలెక్టర్ సమీక్ష!

Markapur: మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల తరలింపు ప్రక్రియను ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.

ఆగస్టు 22న వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ట్రయల్ రన్ నేపథ్యంలో బుధవారం మార్కాపురం కలెక్టరేట్‌లో ముంపు గ్రామాల పునరావాసం, మౌలిక వసతులపై అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

పరిహారం అందిన నిర్వాసితులతో అధికారులు సహృద్భావ వాతావరణంలో చర్చించి, ఎలాంటి ఒత్తిడి లేకుండా సున్నితంగా పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి నిర్వాసిత కుటుంబానికి పరిహారం విషయంలో న్యాయం చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

సుంకేసుల, కలనూతల, గుండెచర్ల, గొట్టిపడియ, చింతలముడిపి, కాటమరాజు తండా, లక్ష్మీపురం, కృష్ణానగర్, అక్కచెరువు గ్రామాల ప్రజలను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

పునరావాస కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులపై ప్రతిరోజూ ప్రోగ్రెస్ రిపోర్టు అందజేయాలని సూచించారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story