Markapuram: వెలిగొండ ప్రాజెక్టే మార్కాపురం కల్పవృక్షం కలెక్టర్ విజయ సునీత

Markapuram: మార్కాపురం అభివృద్ధికి వెలిగొండ ప్రాజెక్టు కల్పవృక్షం. కరువు, ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని వెల్లడించిన కలెక్టర్ విజయ సునీత, జేసీ పులి శ్రీనివాసులు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 Sept 2026 4:22 PM IST
Markapuram
X

Markapuram: వెలిగొండ ప్రాజెక్టే మార్కాపురం కల్పవృక్షం కలెక్టర్ విజయ సునీత

Markapuram: మార్కాపురం జిల్లా అభివృద్ధికి వెలిగొండ ప్రాజెక్టు ఒక కల్పవృక్షం లాంటిదని కలెక్టర్ విజయ సునీత పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులతో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కలెక్టర్ మాట్లాడారు.

ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం కావడంతో జిల్లా ప్రజల కల సాకారమైందన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలించి కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమన్నారు.

వెలిగొండ జలాలతో వ్యవసాయం అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి, పరిశ్రమలు, విద్యా రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయని కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ప్రతి ఒక్క వెలిగొండ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని విజయ సునీత స్పష్టం చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story