Yerragondapalem: వెలిగొండ కెనాల్‌లో యువకుల గల్లంతు SDRF ముమ్మర గాలింపు!
Yerragondapalem: కటాకనిపల్లి వద్ద వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో శనివారం గల్లంతైన యువకుల ఆచూకీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతోంది.
Yerragondapalem: వెలిగొండ కెనాల్‌లో యువకుల గల్లంతు SDRF ముమ్మర గాలింపు!
Yerragondapalem: పెద్ద దోర్నాల మండలం కటాకనిపల్లి వద్ద వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో శనివారం గల్లంతైన యువకుల ఆచూకీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతోంది. వైపాలెం సీఐ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కెనాల్‌లో గాలింపు కొనసాగిస్తున్నారు.
కెనాల్‌లో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో పాటు లోతు ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ గల్లంతైన యువకుల ఆచూకీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.
మరోవైపు యువకులు గల్లంతై మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు మృతదేహాలు వెలికితీయకపోవడంతో వారి బంధుమిత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేసి మృతదేహాలను వీలైనంత త్వరగా వెలికితీసి తమకు అప్పగించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
నీటి ప్రవాహం, కెనాల్ లోతు కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని బంధుమిత్రులు, గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.




