Srisailam: సశ్యశ్యామలంగా రాష్ట్రం ఉండాలని శ్రీశైలంలో వరుణయాగం!

Srisailam: శ్రీశైలంలో సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం శుక్రవారం ప్రారంభమైందని ఆలయ అధికారులు తెలిపారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 7 Aug 2026 9:45 AM IST
Srisailam
X

Srisailam: సశ్యశ్యామలంగా రాష్ట్రం ఉండాలని శ్రీశైలంలో వరుణయాగం!

Srisailam: శ్రీశైలం సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో దేవస్థానం నిర్వహిస్తున్న వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ప్రారంభవుతుందని నేడు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం గణపతిపూజ, ఋత్విగ్వరణం, ఋష్యశృంగజపం, వారుణానువాక పారాయణలు, వరుణజపం, భాగవత, విరాటపర్వపారాయణలు, పంచాక్షరి జపం జరిపించబడుతాయన్నారు.

కాగా ఈ కార్యక్రమములో దేవస్థానం అర్చకస్వాములు, వేదపండితులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రానున్న సుమారు 36 మంది ఋత్వికులు కూడా ఆయా కార్యక్రమాలలో పాల్గోనున్నారని వారు తెలియజేశారు.

అదేవిధంగా 8వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు ప్రతీరోజు ఋష్యశృంగజపం, వారుణానువాక పారాయణలు, వరుణజపం, భాగవత, విరాటపర్వపారాయణలు, పంచాక్షరి జపం జరిపించబడుతాయన్నారు.

అలాగే 9వ తేదీ విశేష కార్యక్రమాలలో భాగంగా ఉదయం యాగశాల ప్రవేశం, శివసంకల్పం, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహావాచనం, చండీశ్వరపూజ, కంకణపూజ, కంకణధారణ, ఋత్విగ్వరణం, అఖండస్థాపన, రుద్ర,చండీ కలశస్థాపనలు, మండపారాధనలు, ఘటశుద్ధి, ఘటాలంకారములు, రుద్రపారాయణలు జరిపించడుతాయని పేర్కొన్నారు.

అదేవిధంగా సాయంత్రం అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠాపన, రుద్రహోమం, ఉపాంగదేవతాహవనాలు, జపాంగహవనాలు, ఏకాదశ రుద్ర ఋష్యశృంగ సహిత సహస్రఘటస్థాపన, కలశార్చనలు, రుద్రపారాయణలు జరిపించబడుతాయని తెలిపారు.

కాగా 10వ తేదీ ఉదయం ఏకాదశ రుద్ర ఋష్యశృంగ సహిత సహస్రఘటార్చన, మహాన్యాసపారాయణలు, రుద్ర, కాఠక, శతానువాక పారాయణ, వేదపారయణలు, వారుణానువాక సహిత ఋష్యశృంగపారాయణ, రుద్రహోమం, చండీపారాయణ, శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేషకుంకుమార్చనలు జరిపించబడుతాయని పేర్కొన్నారు.

ఉదయం గం.7.00లకు నదీపూజ, పుణ్యనదీజలాలతో పాతాళేశ్వరస్వామివారికి, నందీశ్వరస్వామి వారికి, అంకాళమ్మవారికి, బయలువీరభద్రస్వామివారికి అభిషేకం జరిపించబడుతుందని పేర్కొన్నారు.

అనంతరం ప్రధాన ఘటాలతో ఆలయ ప్రదక్షిణ, శ్రీ మల్లికార్జునస్వామివారికి పంచామృతాభిషేకం, ప్రధాన ఘటాభిషేకం, సహస్రఘటాభిషేకం నిర్వహించబడుతాయన్నారు.

11 వతేదీన పూర్ణాహుతి, కలశోద్వాసనతో వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ముగించబడుతుందని తెలియజేశారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story