Srisailam: శ్రీశైలం ఆత్మహత్యల ఘటనపై సమగ్ర విచారణ డీఎస్పీ రామాంజి నాయక్
Srisailam: వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యపై డీఎస్పీ రామాంజి నాయక్ దర్యాప్తు. ఈవో, చైర్మన్ పరిశీలన మరియు సత్రం నిర్వాహకులకు నోటీసులు.
Srisailam: శ్రీశైలం ఆత్మహత్యల ఘటనపై సమగ్ర విచారణ డీఎస్పీ రామాంజి నాయక్
Srisailam: శ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఓ కుటుంబం ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన కుటుంబం గతనెల 28న ఓ ఆటోలో వచ్చి వడ్డెర సత్రంలో రూమ్ 11ను తీసుకున్నారు అప్పటినుండి ప్రతిరోజు సత్రంలో భోజనానికి రావడం బయట తిరగడం ఆలయానికి వెళ్లి రావడం చేస్తున్నారు అయితే గత మూడు రోజులుగా రూమ్ నుండి ఎవరు బయటకు రాకపోవడం పైగా దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులు కిటికీలోనుంచి చూడగా ఉరివేసుకున్న దృశ్యాలు చూసి కంగుతిన్నారు.
వెంటనే శ్రీశైలం పోలీసులకు సమాచారం ఇచ్చారు డి.ఎస్.పి రామాంజి నాయక్ ఆధ్వర్యంలో తలుపులు తెరచి చూడగా బాత్రూమ్ లో ముగ్గురు మహిళలు,మెయిన్ రూమ్ లో ఫ్యాన్ కు ఇద్దరు పురుషులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు మృతి చెందిన మృతుల వివరాలు ఇలా ఉన్నాయి సుధాకర్(36),గోగుల ఆదిలక్ష్మి(50),మల్లేశ్వరి(45),శ్రీదేవి(33),మణికంఠ(15)గా గుర్తించారు ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా పోలీసులు భావిస్తున్నారు ముగ్గురు అక్కలలో ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు అయిన భర్తలు వదిలేయడం ఒక అక్కకు పెళ్లి చేయకపోవడం తీవ్ర అప్పులు కావడంతో ఓ అక్క కొడుకుతో సహా మొత్తం 5 మంది శ్రీశైలం వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల ద్వారా సమాచారం తెలుస్తుంది.
విషయం తెలుసుకున్న శ్రీశైల దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు,ఈవో శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్న సత్రంలోని రూమును పరిశీలించారు మృతుల వివరాలను డీఎస్పీ రామాంజి నాయక్ తో అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో ఈవో,చైర్మన్ వేరు వేరుగా సంయుక్తంగా మాట్లాడుతూ శ్రీశైలం క్షేత్రంలో ఒకే కుటుంబం ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వం ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు వడ్డే సత్రం నిర్వాహకులు కూడా 48 గంటలకు మించి రూమ్ ఇవ్వకూడదని రూల్స్ ఉన్న ఎలా ఇచ్చారని ఈవో,చైర్మన్ మండిపడ్డారు.
సత్రం నిర్వాహకులకు కూడా నోటీసు ఇస్తామని క్షేత్రంలోని మిగతా సత్రాల వారు కూడా రూల్స్ తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నామని ఈవో,చైర్మన్ అన్నారు అనంతరం డీఎస్పీ రామంజి నాయక్ మాట్లాడుతూ ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు.




