Giddalur: గిద్దలూరు-నంద్యాల రహదారిపై వాహనం ఢీకొని సాంబర్ జింక మృతి!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు-నంద్యాల రహదారిపై దిగువమెట్ట స్టీల్ బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని సాంబర్ జింక మృతి చెందింది.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 17 Aug 2026 10:33 AM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు-నంద్యాల రహదారిపై వాహనం ఢీకొని సాంబర్ జింక మృతి!

Giddalur: గుండ్లకమ్మ రేంజ్ పరిధిలోని గిద్దలూరు–నంద్యాల ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక సాంబర్ జింక మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

సుమారు రాత్రి 7:30 గంటల సమయంలో, దిగువమెట్ట స్టీల్ బ్రిడ్జి దాటిన అనంతరం రహదారిపైకి వచ్చిన సాంబర్ జింకను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

సమాచారం అందిన వెంటనే అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతి చెందిన సాంబర్ జింకను అటవీ శాఖ నిబంధనల ప్రకారం పరిశీలించి, తదుపరి చర్యలు చేపట్టారు.

వన్యప్రాణులు రహదారులు దాటే ప్రాంతాల్లో వాహనదారులు వేగాన్ని నియంత్రించి, అప్రమత్తంగా వాహనాలు నడపాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వన్యప్రాణుల సంచారం ఉండే ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ప్రయాణించాలని అటవీ శాఖ అధికారులు కోరారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story