Kurnool: కోడుమూరులో వింత ఆచారం.. కొండలరాయుడికి తేళ్ల నైవేద్యం!

Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు కొండలరాయుడు ఆలయంలో శ్రావణ మూడో సోమవారం తేళ్ల పండుగ ఘనంగా జరిగింది.

C. Ganesh, Kodumuru
Published on: 31 Aug 2026 9:29 PM IST
Kurnool
X

Kurnool: కోడుమూరులో వింత ఆచారం.. కొండలరాయుడికి తేళ్ల నైవేద్యం!

కర్నూలు: కర్నూలు జిల్లా కోడుమూరులో కొండపై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి కొండలరాయుడు ఆలయంలో దశాబ్దాలుగా క ఒక వింత ఆచారం కొనసాగుతోంది.ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మూడో సోమవారం నాడు ఇక్కడ తేళ్ల పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది.

భక్తులు కొండపైకి చేరుకుని, అక్కడి చిన్న చిన్న రాళ్లను కదిలించి వాటి కింద ఉండే బతికున్న తేళ్లను పట్టుకుంటారు. అలా దొరికిన తేళ్లకు దారాలు కట్టి, స్వామివారికి నైవేద్యంగా మరియు హారాలుగా సమర్పిస్తారు. సాధారణంగా విషపూరితమైన తేళ్లను చూస్తేనే భయపడతాం, కానీ ఈ కొండపై స్వామివారి మహిమ వల్ల ఆ రోజు తేళ్లు భక్తులకు ఎలాంటి హాని చేయవని ఇక్కడి ప్రజల గట్టి నమ్మకం.

భక్తులు చిన్న పిల్లలతో సహా ఆ తేళ్లను తమ చేతులు, భుజాలపై ఉంచుకుని ఆడుకుంటారు.ఈ విధంగా స్వామివారికి తేళ్లను సమర్పించడం వల్ల తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఒకవేళ పొరపాటున ఎవరికైనా తేలు కుట్టినా, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆ నొప్పి తగ్గిపోతుందని స్థానికులు చెబుతారు.ఈ వింత ఆచారాన్ని కళ్లారా చూడటానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు కోడుమూరు కొండకు తరలివచ్చారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story