Kurnool: రైతులకు సబ్సిడీ విత్తనాల పేరిట భారీ మోసం

Kurnool: సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇప్పిస్తామని నమ్మించి రూ.7 లక్షలు వసూలు చేసిన ఇద్దరు అగ్రికల్చర్ అసిస్టెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Bheemalinga, Aluru
Published on: 18 July 2026 10:48 AM IST
Kurnool
X

Kurnool: రైతులకు సబ్సిడీ విత్తనాల పేరిట భారీ మోసం

Kurnool: నమ్మి డబ్బులు అందజేసిన అన్నదాతలను మోసం చేసిన ఇద్దరు ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులు కటకటాలపాలయ్యారు. కర్నూలు జిల్లా హోలగుంద మండల పరిధిలో రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇప్పిస్తామని నమ్మించి లక్షలాది రూపాయల వసూళ్లకు పాల్పడిన ఇద్దరు అగ్రికల్చర్ అసిస్టెంట్లపై స్థానిక పోలీసులు శనివారం కేసులు నమోదు చేసి, వారిని రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నెరినికి, లింగంపల్లె గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు తమ పరిధిలోని రైతులను సంప్రదించారు. ప్రభుత్వ సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు తక్కువ ధరకే అందిస్తామని నమ్మబలికారు. అది నిజమేనని నమ్మిన రెండు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున సదరు అధికారులకు నగదు అందజేశారు. ఇలా రైతుల నుండి సదరు అసిస్టెంట్లు మొత్తం రూ. 7 లక్షల రూపాయలను వసూలు చేశారు.

నెల రోజులుగా పరారీ.. రైతుల ఆందోళన:

డబ్బులు తీసుకున్న అధికారులు రైతులకు సబ్సిడీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ పంపిణీ చేయలేదు. అంతేకాకుండా, బాధితులు నిలదీస్తారనే భయంతో గత నెల రోజులుగా విధులకు హాజరుకాకుండా గ్రామాలకు రావడం పూర్తిగా బంద్ చేశారు. తమ డబ్బులు పోవడమే కాకుండా, సకాలంలో విత్తనాలు అందక సాగు సమయం మించిపోతుండటంతో ఆగ్రహానికి గురైన రైతులు హోలగుంద పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story