Markapuram: బొమ్మలాపురంలో ఆవుల మందపై పెద్దపులి దాడి.. తీవ్ర గాయాలు!

Markapuram: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురంలో పెద్దపులి సంచారం. ఆవుల మందపై దాడి చేయడంతో ఆవుకు తీవ్ర గాయాలు. అటవీ అధికారులను కోరుతున్న గ్రామస్తులు.

Srikanth Singam, Markapur
Published on: 13 Sept 2026 10:14 AM IST
Markapuram
X

Markapuram: బొమ్మలాపురంలో ఆవుల మందపై పెద్దపులి దాడి.. తీవ్ర గాయాలు!

Markapuram: దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామంలోని ఊరకొండ సమీపంలో మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

ఆవుల మందపై ఒక్కసారిగా దాడి చేసిన పులి.. ఓ ఆవుపై దాడి చేయడంతో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. పులి దాడిని గమనించిన ఆవుల కాపరులు అప్రమత్తమై అక్కడి నుండి తరలించారు

ఈ ఘటనతో బొమ్మలాపురం గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు ఆందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు స్పందించి పులి సంచారంపై నిఘా ఏర్పాటు చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur