Srisailam: శ్రీశైలంలో నిత్యకళారాధన తోలుబొమ్మలాట రూపంలో ‘సుందరకాండ’!

Srisailam: శ్రీశైల నిత్య కళారాధనలో పోరుమామిళ్ల వై.వి. నరసింహారావు బృందం ప్రదర్శించిన ‘సుందరకాండ’ తోలుబొమ్మలాట భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 28 Aug 2026 9:27 AM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో నిత్యకళారాధన తోలుబొమ్మలాట రూపంలో ‘సుందరకాండ’!

Srisailam: శ్రీశైల దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) గురువారం శ్రీ వై.వి. నరసింహారావు, పోరుమామిళ్ళ, కడప జిల్లా వారిచే రామాయణం - సుందరకాండ పై తోలుబొమ్మలాట కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద గురువారం సాయంకాలం నుండి ఈ తోలుబొమ్మలాట కార్యక్రమం కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమములో కథకులుగా వై.వి. నరసింహారావు వ్యవహరించగా, గాత్ర సహకారాన్ని కొండమ్మ, నాగేశ్వరరావు, రమణమ్మ, శ్రీనివాసరావు తదితరులు అందిస్తున్నారు. కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.

శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story