Srisailam: శ్రీశైలంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన!
Srisailam: శ్రీశైల దేవస్థానంలో ఘనంగా నిత్యకళారాధన కార్యక్రమాలు. సికింద్రాబాద్ నాట్య మయూరి అకాడమి ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన.
Srisailam: శ్రీశైలంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన!
Srisailam: శ్రీశైల దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధనలో) సోమవారం నాట్య మయూరి కూచిపూడడి డాన్సు అకాడమి, సికింద్రాబాద్ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమములో వినాయకకౌత్వం, మూషికవాహన, భో...శంభో, లింగాష్టకం, శివాష్టకం తదితర గీతాలకు, అష్టకాలకు చరణశ్రీ, మోక్ష, మనస్వి, సిరి, శ్రీనిధి, వైష్ణవి తదితరులు నృత్యప్రదర్శన చేయనున్నారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహించ బడుతున్నాయి




