Alur: దాడి చేసిన ఎమ్మెల్యేని పరామర్శించడమే జగన్ నైజం: టీడీపీ నేత!

Alur: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి వైఎస్ జగన్ రావడం సిగ్గుచేటని ఆలూరు టీడీపీ మాజీ ఇన్‌ఛార్జి వైకుంఠం శివప్రసాద్ విమర్శించారు.

Bheemalinga, Aluru
Published on: 12 Aug 2026 11:45 PM IST
Alur
X

Alur: దాడి చేసిన ఎమ్మెల్యేని పరామర్శించడమే జగన్ నైజం: టీడీపీ నేత!

ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు సంగళ దళిత మహిళపై దాడి చేసిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ను పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం సిగ్గు చేటని ఆలూరు టిడిపి మాజీ ఇంచార్జి వైకుంఠం శివప్రసాద్ అన్నారు బుధవారం రాత్రి స్థానిక ఆర్ అండ్ బి అతిది గృహం లో నిర్వహించిన విలేఖర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ నెమెకల్ లో రౌడీ లా ఎమ్మెల్యే విరూపాక్షి,ఆయన కుమారుడు సోదరుడు మహిళలపై దాడులు చేయడం సరికాదన్నారు.

గౌరవ ప్రదమైన పదవి లో ఉండి ఇలా దాడులు చేయడం ఏమిటన్నారు.దళితుల పై జగన్ చిత్త శుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు..వైసీపీ లో పిల్ల బచ్చ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పిట్ట కథలు చెబుతూ తప్పు చేసిన ఎమ్మెల్యేకు మద్దతుగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. జిల్లా వైసీపీ సీనియర్ నాయకులు కూడా ఆలోచించాలన్నారు.జరిగిన వాస్తవం పై తెలుసుకోవాలన్నారు..రాష్ట్రం లో జరిగిన దాడి పై దళిత సంఘాలు కూడా ఖండిస్తున్నాయన్నారు.సమావేశం లో మార్కెట్ యార్డ్ చైర్మెన్ బిల్లేకల్ వెంకటేష్, సొసైటీ చైర్మెన్ విష్ణు వర్ధన్ రెడ్డి,టిడిపి నాయకులు కొమ్ము రాజు,మసాలా జగన్ , రామాంజనేయులు,దస్తగిరి,హనుమప్ప పాల్గొన్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story