Kurnool: కర్నూలు ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా సురేంద్ర!
Kurnool: ఆంధ్రా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ASF) కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా సురేంద్ర, ప్రధాన కార్యదర్శిగా జనార్ధన్ నియామకమయ్యారు. బలోపేతానికి కార్యవర్గం పిలుపు.
Kurnool: కర్నూలు ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా సురేంద్ర!
Kurnool: కర్నూలు నగరంలో జరిగిన ఆంధ్రా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ASF) జిల్లా నూతన కమిటీ కార్యవర్గ సమావేశంలో, కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా సురేంద్రను నియమిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం. హేమాద్రి యాదవ్ తెలిపారు.
అదేవిధంగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జనార్ధన్‌ను నియమిస్తూ, జిల్లాకు సంబంధించిన ఇతర కమిటీ విభాగాలు మరియు నూతన కార్యవర్గ సభ్యులను కూడా ప్రకటించడం జరిగింది.
సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం. హేమాద్రి యాదవ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ కృషి చేయాలని సూచించారు. కర్నూల్ జిల్లాలో ఆంధ్రా స్టూడెంట్స్ ఫెడరేషన్‌ను మరింత బలోపేతం చేస్తూ ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల హక్కులు, సంక్షేమం మరియు సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ, ప్రతి విద్యార్థికి అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతూ, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని నూతన కమిటీకి సూచించారు.
విద్యార్థి ఐక్యతే మా బలం అనే నినాదంతో కర్నూల్ జిల్లాలో ఏఎస్ఎఫ్‌ను మరింత బలోపేతం చేసి, విద్యార్థుల కోసం సమర్థవంతంగా పనిచేయాలని హేమాద్రి యాదవ్ పిలుపునిచ్చారు.




