Giddalur: గిద్దలూరులో ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు చిన్న మసీదు వద్ద ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి. చిన్నారులపై పెరిగిన దాడులతో భయాందోళనలో స్థానికులు.
Giddalur: గిద్దలూరులో ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని చిన్న మసీదు సమీపంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా ఓ వీధి కుక్క ఐదేళ్ల బాలుడిపై బీభత్సంగా దాడి చేసి కరిచిన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది.
ఇటీవల కాలంలో గిద్దలూరులో చిన్నారులపై వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు బయట ఆడుకునేందుకు కూడా జంకుతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Next Story




