Srisailam: మల్లన్న భక్తులకు అదిరిపోయే వార్త.. ఇకపై అన్నీ ఫస్ట్ క్లాస్!
Srisailam: శ్రీశైల క్షేత్రంలో భక్తుల సౌకర్యాలపై ఈవో శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు.
Srisailam: మల్లన్న భక్తులకు అదిరిపోయే వార్త.. ఇకపై అన్నీ ఫస్ట్ క్లాస్!
శ్రీశైలం నంద్యాల జిల్లా: శ్రీశైలం మహా క్షేత్రంలో ఈరోజు సాయంత్రం పరిపాలన భవనంలో భక్తుల సదుపాయాలపై అధికారులతో ఈవో శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు దేవస్థానంలో ప్రతి ఉద్యోగి కూడా భక్తుల సౌకర్యాల కల్పననే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వహించాలన్నారు ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శనం ఏర్పాట్లు మంచినీటి సదుపాయం అన్న ప్రసాద వితరణ ఉచిత ప్రసాద వితరణ సౌచాలయాల నిర్వహణ పారిశుద్ధ్యం నిర్వహణ లాంటి మౌలిక వసతులపై భక్తుల నుంచి 90% సానుకూలంగా స్పందన ఉండాలన్నారు అందుకు అనుగుణంగా ఉద్యోగస్తులందరూ విధులు నిర్వహించాలన్నారు రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర దేవాలయాల పాలన సంస్థ(SITA STATE iNSTITUTE TEMPLE ADMISTTRATION) వంట స్వాములకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.
వంట స్వాములు అన్న ప్రసాదాలను ఆలయంలోని ప్రసాదాలను తయారు చేయాలన్నారు వంటకాల ప్రమాణికరణ పట్ల శ్రద్ధ వహించాలన్నారు ఒక వంటకాన్ని ప్రతిసారి ఒకే రుచి నాణ్యత మరియు పరిణామాలతో తయారు చేయడానికి అనుసరించే విధానాన్ని వంటకాల ప్రామాణికరణంగా ఉండాలని పేర్కొన్నారు(SOP STANDARD 0PERATING PROCEDURE) అన్న ప్రసాద వితరణలో ప్రతిరోజు కూడా తాజా కూరగాయలు మాత్రమే వాడాలి అన్నారు అన్న ప్రసాద వితరణలో భక్తులతో మర్యాదగా మెలగాలన్నారు వడ్డెన సమయంలో ఆత్మీయంగా ఆయా వంటకాలను వడ్డిస్తుండాలన్నారు.




