Srisailam: మహిళల రక్షణే పోలీసుల ప్రాధాన్యత: సుండిపెంటలో ‘శక్తి’ యాప్‌పై అవగాహన!
Srisailam: నంద్యాల జిల్లా సుండిపెంటలో మహిళలు మరియు పిల్లల రక్షణపై పోలీసులు అవగాహన కల్పించారు. శక్తి యాప్, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 మరియు డ్రగ్స్ నివారణకు ఈగల్ వింగ్ (1972) నంబర్ల గురించి ఎస్‌ఐ గంటా సుబ్బారావు వివరించారు.
Srisailam: మహిళల రక్షణే పోలీసుల ప్రాధాన్యత: సుండిపెంటలో ‘శక్తి’ యాప్‌పై అవగాహన!
శ్రీశైలం: నంద్యాల జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆత్మకూరు డిఎస్పీ పర్యవేక్షణలో శ్రీశైలం మండలం సుండి పెంట టూ టౌన్ ఎస్ఐ గంటా సుబ్బారావు ఆధ్వర్యంలో పూర్ణానంద ఆశ్రమం దగ్గర లేబర్ కాలనీ నందు మహిళలతో "క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ మరియు చిల్డ్రన్ సేఫ్టీ గురించి అవేర్నెస్ కల్పించడం అయినది. మహిళలకు సంబంధించిన చట్టాల గురించి మరియు అందరికీ శక్తి యాప్ గురించి దాని నంబర్ 7993485111 గురించి తెలపటం అయినది.మాదకద్రవ్యాలైన గాంజా, హెరాయిన్ ఇతర మత్తు పదార్థాలు గురించి ఏదైనా తెలిసిన "ఈగల్" అని ఒక వింగ్ ఉన్నదని దానికి 1972 కాల్ చేయవచ్చునని తెలపటమైనది సైబర్ నేరాలు జరిగినచో టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేయాలని అలాగే బాల్యవివాహాలు, చిన్న పిల్లలపై నేరాలు జరిగినచో 1098 కు ఫిర్యాదు చేయవచ్చు అని తెలపటమైనది అత్యవసర పరిస్థితులలోఎమర్జెన్సీ కాల్స్ అయిన dail 100,112 కు ఫోన్ చేయవచ్చని ఎస్ ఐ గంట సుబ్బారావు తన సిబ్బందితో తెలపటమైనది.




