Srisailam: శ్రీశైలంలో భక్తుల రద్దీ విరామ బ్రేక్ దర్శనాలు నిలుపుదల!
Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. వారాంతపు సెలవులతో విరామ బ్రేక్, ఆర్జిత సేవలు రద్దు. దర్శనానికి 4 గంటల సమయం.
Srisailam: శ్రీశైలంలో భక్తుల రద్దీ విరామ బ్రేక్ దర్శనాలు నిలుపుదల!
Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ. వారాంతపు సెలవులు రావడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు. భక్తుల రద్దీ కారణంగా నేడు విరామ బ్రేక్ దర్శనాలు నిలుపుదల. సిఫారసు లేఖలతో వచ్చే వారికి కూడా శ్రీ స్వామి అమ్మవారి అలంకార దర్శనం మాత్రమే అనుమతి. ఇప్పటికే మనమిత్ర,వాట్సాప్ ఆన్లైన్లో,స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారికి నిర్దిష్ట వేళల్లో స్పర్శ దర్శనానికి అనుమతి.
క్యూలైన్లో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేందుకే స్పర్శ దర్శనం రద్దు చేస్త కీలక నిర్ణయం తీసుకున్న దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు,ఈఓ శ్రీనివాసరావు. భక్తుల రద్దీ దృష్ట్యా శని,ఆది, సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు,కుంకుమార్చనలు నిలుపుదల చేసిన అధికారులు. ఉచిత, శీఘ్ర,అతిశీఘ్ర,దర్శనాల క్యూలైన్ల ద్వారా భారీగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.
క్యూలైన్ల నిర్వహణను నిరంతరం భక్తులకు ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తున్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు,ఈవో శ్రీనివాసరావు. శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీతో సందడిగా మరినా శ్రీశైలం క్షేత్రం.




