Srisailam: మల్లన్న క్షేత్రంలో వరుణయాగం 1000 కలశాలతో స్వామికి ఘటాభిషేకం!

Srisailam: శ్రీశైలంలో 4వ రోజు వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రమేష్, ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 10 Aug 2026 4:53 PM IST
Srisailam
X

Srisailam: మల్లన్న క్షేత్రంలో వరుణయాగం 1000 కలశాలతో స్వామికి ఘటాభిషేకం!

Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో నాల్గవ రోజు కొనసాగుతున్న వరుణ యాగ సహితసహస్ర ఘటాభిషేకం వెయ్యికిపైగా కలశాలతో శాస్త్రోక్తంగా శ్రీమల్లికార్జునస్వామివారికి అభిషేకం పూజలలో పాల్గొన్న దేవదాయశాఖ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్,ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడు,ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో ఈనెల 7 నుండి 11 వరకు 5 రోజులపాటు నిర్వహింపబడుతున్న వరుణయాగసహిత సహస్ర ఘటాభిషేక కార్యక్రమాలలో నాలుగవరోజు వేకువజామున ఏకాదశ రుద్ర ఋష్యశృంగ సహిత సహస్ర ఘటార్చన, మహాన్యాస పారాయణ, రుద్రపారాయణ, కాఠక శతానువాక పారాయణ, వేదపారాయణలు, వారుణానువాక సహిత ఋష్యశృంగ పారాయణ, రుద్రహోమం,చండీపారాయణ, శ్రీచక్రార్చాన, నవావరణార్చన విశేష కుంకుమార్చనలు జరిపారు.

కృష్ణవేణీ పుణ్యనదీజలాలలోతోనూ ఆలయ ప్రాంగణములోని మల్లికాగుండ పవిత్రజలంతోనూ అభిషేకం దేవస్థానం అర్చక,వేదపండితులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి 36 మంది ఋత్వికులు పాల్గొన్నారు పాతాళగంగ వద్ద కృష్ణవేణీనదీమతల్లికి పూజలు జరిపి కలశాలలో కృష్ణవేణీనదీ పుణ్యనదీజలాలను తీసుకొచ్చి అర్చకలు,చైర్మన్,ఈవో సంప్రదాయాన్ని అనుసరించి కృష్ణవేణీనదీ జలాలతో పాతాళేశ్వరస్వామికి అభిషేకలు నిర్వహించి జలకలశాలను తలపై పెట్టుకుని వేదమంత్రాల నడుమ భజంత్రీలతో నందిగుడిలో నందీశ్వరస్వామికి,గ్రామదేవత అంకాళమ్మకు క్షేత్రపాలకుడు వీరభద్రస్వామివారికి అభిషేకాది అర్చనలను జరిపించారు.

తరువాత జలకలశాలతోనే ప్రధానాలయం వద్దకు చేరుకుని అక్కమహాదేవి అలంకార మండపంలో నెలకొల్పబడిన ప్రధాన,ఇతర కలశాలకు,కృష్ణవేణీనదీజల కలశాలకు శాస్త్రోక్తంగా పూజాలు జరిపి శ్రీమల్లికార్జునస్వామికి సహస్రఘటాభిషేకం ప్రారంభించి ఘటాభిషేకం పూర్తయ్యేంతవరకు నిరంతరంగా అర్చకులు రుద్రమంత్రాలను పఠించడం జరుగుతుందని ఘటాభిషేకం పూర్తయిన తరువాత మహానివేదన,నీరాజన,మంత్రపుష్ప కార్యక్రమాలు జరగనున్నాయి ఘటాభిషేకం సందర్భంగా శ్రీస్వామివారి గర్భాలయానికి అడ్డంగా మూడు అడుగుల మేర తాత్కాలికంగా గోడ కట్టి రోజంతా శ్రీస్వామివారు ఘటాభిషేకజలంలోనే వుండనున్నారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story