Srisailam: శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన సీడబ్ల్యూసీ బృందం

Srisailam: శ్రీశైలం జలాశయాన్ని ఆకస్మికంగా పరిశీలించిన కేంద్ర జల సంఘం (CWC) అదనపు కార్యదర్శి యోగేష్ పైతాంకర్ బృందం. క్రెస్టు గేట్లు, జలవిద్యుత్ కేంద్రం పరిశీలన.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 12 Aug 2026 11:44 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన సీడబ్ల్యూసీ బృందం

శ్రీశైలం: జలాశయం రేడియల్ ట్రస్ట్ గేట్లు,వాటర్ లెవెల్స్, గ్యాలరీలు, కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో పరిశీలించిన కేంద్ర జల సంఘం సభ్యుల బృందం.

శ్రీశైలం జలాశయాన్ని కేంద్ర జల సంఘం బృందం సభ్యులు పరిశీలించారు కేంద్ర జలసంఘం ఎక్స్ అఫీషియో అదనపు కార్యదర్శి యోగేష్ పైతాంకర్ ఇద్దరు సభ్యులు జలాశయం చేరుకున్నారు అనంతరం జలాశయాన్ని పరిశీలించి అధికారుల ద్వారా జలాశయం వివరాలను కేంద్ర జలసంఘం బృందం అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యంగా జలాశయం రేడియల్ క్రెస్టు గేట్స్,వాటర్ లెవెల్స్,రోప్స్,ప్రస్తుతం జలాశయానికి వస్తున్న వరద నీటి వివరాలను గ్యాలరీలు,కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని కేంద్ర జల సంఘం సభ్యులు పరిశీలించారు శ్రీశైలం జలాశయం పర్యటన ముగిసిన అనంతరం గెస్ట్ హౌస్ లో రాత్రి ఇక్కడే బస చేసి రేపు ఉదయం బనకచర్లను కేంద్ర జల సంఘం సభ్యులు పరిశీలించనున్నారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story