Srisailam: మల్లన్న సేవలో ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

Srisailam: శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 31 Aug 2026 4:42 PM IST
Srisailam
X

Srisailam: మల్లన్న సేవలో ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

శ్రీశైలం: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి దర్శించుకున్నారు.

దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి పార్థసారధికి ఆలయ మర్యాదల అనుసరించి ఆలయ డిప్యూటీ ఈవో చంద్రశేఖర్ అధికారులు,అర్చకులు స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం,అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలు మంత్రి పార్థసారధికి దేవస్థానం డిప్యూటీ ఈవో చంద్రశేఖర్ అందజేశారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story