Atmakur: శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో "చలివేంద్రం" ప్రారంభం
Atmakur: ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద శ్రీకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.
Atmakur: శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో "చలివేంద్రం" ప్రారంభం
Atmakur: ఎండలు మండుతున్న నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షనీయమని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయం ప్రధాన గేటు వద్ద శ్రీకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ను ఇవాళ ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ రిబ్బన్ కత్తిరించగా సిఐ జి గంగాధర్, ఆర్టీసీ డిపో మేనేజర్ శివ కేశవ యాదవ్, పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ సేవా సమితి నిర్వాహకులు, అతిధులను శాలువాతో సత్కరించారు. అనంతరం ప్రజలకు శీతల పానీయాలను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గంగా ప్రసాద్, డిపో మేనేజర్ శివ కేశవ యాదవ్ లో మాట్లాడుతూ నిత్యం వేలాది ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ దాహార్తిని తీర్చుకోవాలని కోరారు.
నిర్వాహకులు గుర్రం నాగేశ్వరరావు మాట్లాడుతూ గత రెండేళ్లుగా ఇదే ప్రాంతంలో తమ సంస్థ ద్వారా ఎండాకాలంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి సహకరించిన కమిషనర్ గంగా ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఆదిశేషయ్య, మెప్మా సీవో మాధవి,గుర్రం నాగేశ్వరరావు, కటారి సుధాకర్, రమేష్ బాబు, దేవరాల వెంకటరమణ, గాలిబోయిన అయ్యన్న, ఎలగాల కృష్ణయ్య, సుందరయ్య, వెంకటేశ్వర్లు, బొబ్బల మల్లికార్జున, గోగుల మహేంద్ర, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.




