Nandyal: అహోబిలంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల ప్రత్యేక పూజలు!
Nandyal: అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు.
Nandyal: అహోబిలంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల ప్రత్యేక పూజలు!
Nandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, మాజీ విప్ కొరముట్ల శ్రీనివాసులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారులు వేదమంత్రోచ్ఛారణల మధ్య వారిచేత ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహింపజేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి, దుస్సాలువలతోసత్కరించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలతో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పుష్కలంగా పండి, రైతులు ఆనందంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా జీవించాలని నేతలు ఆకాంక్షించారు.
Next Story




