Markapuram: వ్యాపారుల పాలిట 'గొడుగు'లా నిలిచిన ట్రస్ట్.. మార్కాపురంలో సేవా పర్వం
Markapuram: మార్కాపురంలో చిరు వ్యాపారులకు 'స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్' అండ.
Markapuram: వ్యాపారుల పాలిట 'గొడుగు'లా నిలిచిన ట్రస్ట్.. మార్కాపురంలో సేవా పర్వం
Markapuram: మార్కాపురం పట్టణంలో జీవనోపాధి కోసం రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న శ్రమజీవులకు స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గొడుగులను పంపిణీ చేశారు. మండుతున్న ఎండల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద వ్యాపారులను ఆదుకునేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని గడియారం స్తంభం సమీపంలో, పార్క్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో చెప్పులు కుట్టుకునే వారు, తాళాలు రిపేరు చేసే వారు, తినుబండారాలు తయారు చేసి అమ్ముకునే వారు, చిన్న చిన్న వ్యాపారాల ద్వారా జీవనం సాగించే అనేకమంది లబ్ధి పొందారు. రోజంతా ఎండలో కష్టపడే వీరికి గొడుగులు అందించడం ద్వారా కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పులి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ ఎగ్జిక్యూటివ్ టాక్స్ అసిస్టెంట్ సిరిగిరి శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు టీవీ రామకృష్ణ, చిన్నపిల్లల వైద్యులు లయన్ డాక్టర్ మాధవరావు, దంత వైద్యులు డాక్టర్ కిరణ్, న్యాయవాది భూపని కాశయ్య తదితరులు పాల్గొని సేవా కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు.




