Kurnool: హోంగార్డ్స్ దర్బార్: సమస్యల పరిష్కారానికి కమాండెంట్ హామీ!

Kurnool: సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎ. హనుమంతు ఆధ్వర్యంలో హోంగార్డ్స్ దర్బార్ నిర్వహించి, ముగ్గురు రిటైర్డ్ సిబ్బందిని సన్మానించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 1 Aug 2026 7:05 PM IST
Kurnool
X

Kurnool: హోంగార్డ్స్ దర్బార్: సమస్యల పరిష్కారానికి కమాండెంట్ హామీ!

కర్నూలు: జిల్లా పోలీసు కార్యాలయంలోని మిని కాన్ఫరెన్స్ హాల్లో హోంగార్డ్స్ దర్బార్ ను సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ శ్రీ ఎ. హనుమంతు నిర్వహించారు.

ఈ సందర్భంగా హోంగార్డ్స్ నుంచి అందిన వినతులు, సూచనలు, సమస్యలను ఓర్పుగా విని, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి హోంగార్డు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధతతో సేవలందించాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ అందరితో మర్యాదగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

హోంగార్డ్స్ మరియు వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకాల ప్రాముఖ్యతను వివరించారు.

డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాల్సిన అవసరం, అది లేకపోతే ఎదురయ్యే చట్టపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులపై అవగాహన కల్పించారు.

నివా బుపా ఇన్సురెన్స్ మరియు ఆక్సిస్ బ్యాంక్ అందిస్తున్న ఆరోగ్య బీమా పథకాల ద్వారా అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనల సమయంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన హోంగార్డు శ్రీ కె.సి. పాండురంగ , శ్రీమతి జ్ఞానరత్నమ్మ , శ్రీ సి. కమ్మన్న గారులను శాలువాల , పూల మాలతో ఘనంగా సత్కరించారు. హోంగార్డ్స్ కాంట్రిబ్యూషన్ ఫండ్ చెక్కులను అందజేశారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలవుతున్న విధానానికి అనుగుణంగా పదవీ విరమణ పొందుతున్న హోంగార్డులందరికీ సమానంగా రిటైర్మెంట్ బెనిఫిట్లు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను హోంగార్డ్సు కమాండెంట్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో హోంగార్డ్స్ డీఎస్పీ శ్రీ ప్రసాద్, ఇన్‌చార్జ్ ఆర్ ఐ శ్రీ పోతల రాజు, సబ్ డివిజన్ ఇన్‌చార్జిలు, కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు , హోంగార్డ్స్ పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story