Markapuram: కాపునాడుకు షాక్.. మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి రాజీనామా!

Markapuram: మార్కాపురం జిల్లా కాపునాడు మహిళా అధ్యక్షురాలు పదవికి సిద్ధం కృష్ణవేణి రాజీనామా చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 10 Aug 2026 4:34 PM IST
Markapuram
X

Markapuram: కాపునాడుకు షాక్.. మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి రాజీనామా!

మార్కాపురం: మార్కాపురం జిల్లా కాపునాడు మహిళా అధ్యక్షురాలు సిద్ధం కృష్ణవేణి తన పదవికి రాజీనామా చేశారు. ఉన్నత విద్యావంతురాలైన కృష్ణవేణి గత కొంతకాలంగా జిల్లా కాపునాడు మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూ సమర్థవంతంగా పనిచేశారు.

మహిళలను సంఘటితం చేయడంతో పాటు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనదైన ముద్ర వేశారు. మహిళల సమస్యలపై స్పందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం అయ్యారు.

అయితే తాజాగా జిల్లా కాపునాడు మహిళా అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేయడంతో కాపునాడు మహిళా విభాగంలో చర్చనీయాంశంగా మారింది. ఆమె రాజీనామాకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story