Srisailam: భ్రమరాంబ అమ్మవారికి రూ.27 లక్షల బంగారు గాజులు సమర్పణ!
Srisailam: శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి ఒంగోలు మాజీ మంత్రి సిద్ధారాఘవరావు దంపతుల విరాళం. 186 గ్రాముల బంగారు గాజులు, రూ.3 లక్షల అన్నదాన విరాళం అందజేత.
Srisailam: భ్రమరాంబ అమ్మవారికి రూ.27 లక్షల బంగారు గాజులు సమర్పణ!
Srisailam: శ్రీశైలం మహా పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబ దేవి సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను గురువారం ఒంగోలుకు చెందిన మాజీ మంత్రివర్యులు సిద్ధారాఘవరావు దంపతులు, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం భ్రమరాంబ దేవికి బంగారు గాజులు దేవస్థానమునకు సమర్పించారు. ఈ బంగారు గాజుల మొత్తం బరువు 186 గ్రాములు. వీటి విలువ సుమారు రూ. 27లక్షలకు పైగా ఉంటుందని దాతలు తెలిపారు.
ఈ బంగారు గాజులతో పాటు దేవస్థాన నిత్యప్రసాదవితరణ పథకానికి రూ. 3 లక్షల నగదును కూడా వీరు దేవస్థానానికి అందజేయడం జరిగింది.
కాగా ఈ బంగారు గాజులను మరియు అన్నప్రసాదవితరణ విరాళం మొత్తాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావుకు అందజేశారు.
కార్యక్రమములో స్వామివార్ల ప్రధానార్చకులు శ్రీ హెచ్. వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు యం. శ్రీధర్ శర్మ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం దాత సిద్ధారాఘవరావు, శ్రీమతి లక్ష్మీపద్మావతమ్మ దంపతులకు తగు రశీదులను అందజేసి వేదాశీర్వచనముతో పాటు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేయడం జరిగింది.




