Markapur: కులమతాలకు అతీతంగా సోదరభావం చాటిన షేక్ షేక్షావలి!
Markapur: పెద్దదోర్నాలలో కులమతాలకు అతీతంగా సోదరభావాన్ని చాటుతూ వినాయక ప్రతిమ ఏర్పాటుకు షేక్షావలి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
Markapur: కులమతాలకు అతీతంగా సోదరభావం చాటిన షేక్ షేక్షావలి!
Markapur: పెద్దదోర్నాల కులమతాలకు అతీతంగా సోదరభావాన్ని చాటుతూ శుభకార్యాలకు తనవంతు సహకారం అందించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. రాబోయే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దదోర్నాల మండల కేంద్రంలోని పీర్ల చావిడి బజారులో వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించేందుకు స్థానిక యువత సన్నాహాలు ప్రారంభించారు.
ప్రతిమ ఏర్పాటుతో పాటు పూజా కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నిధుల సేకరణలో భాగంగా పెద్దదోర్నాల సేఫ్టీ డ్రైవర్స్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ టీఎన్‌టీయూసీ అధ్యక్షులు షేక్ షేక్షావలి వినాయక ప్రతిమ ఏర్పాటుకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా షేక్ షేక్షావలి మాట్లాడుతూ.. సమాజంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలందరూ ఐక్యతతో నిర్వహించే ఇలాంటి శుభకార్యాలకు తనవంతు సహకారం అందించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. పీర్ల చావిడి బజారు యువత ఆధ్వర్యంలో నిర్వహించే వినాయక చవితి వేడుకలకు ప్రతి సంవత్సరం తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.
వినాయక చవితి వేడుకల కోసం యువత చేస్తున్న ఏర్పాట్లకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, కులమతాలకు అతీతంగా సోదరభావాన్ని చాటుతున్న షేక్ షేక్షావలిని పీర్ల చావిడి బజారు యువత ప్రత్యేకంగా అభినందించింది. సమాజంలోని అన్ని వర్గాలతో కలిసిమెలిసి ఉంటూ శుభకార్యాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ఆయనను నిజమైన ప్రజాసేవకుడిగా పేర్కొన్నారు.




