Markapuram: మార్కాపురం: SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి దరఖాస్తుల ఆహ్వానం

Markapuram: మార్కాపురం జిల్లాలో SC/ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యత్వానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మా నాయక్ తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 12 Sept 2026 9:32 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం: SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి దరఖాస్తుల ఆహ్వానం

మార్కాపురం జిల్లా: మార్కాపురం జిల్లాలో నూతన SC/ST అట్రాసిటీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం జిల్లాలో SC/STలపై జరిగే అత్యాచార కేసుల పరిశీలన, నివారణ చర్యల కోసం నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

కమిటీలో SC/STలకు చెందిన 5 మంది నాన్‌-ఆఫీషియల్ సభ్యులు, SC/ST కాని వర్గాలకు చెందిన NGO సభ్యులు 3 మంది ఎంపిక చేయనున్నారు. సామాజిక సేవా భావం, SC/ST హక్కులు, అట్రాసిటీ నిరోధక చట్టాలపై అవగాహన ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు, సామాజిక సేవా వివరాలతో కూడిన దరఖాస్తులను సెప్టెంబర్ 18లోపు మార్కాపురం ఆర్‌డీఓ కార్యాలయం పక్కన ఉన్న సహాయ సాంఘిక సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని అధికారులు సూచించారు.

ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారు అనర్హులని, ఎంపికైన సభ్యులకు ఎలాంటి గౌరవ వేతనం చెల్లించబడదని డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్ తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM