Kurnool: 'సాసా'తో కర్నూలు స్వచ్ఛతకు సరికొత్త రూపు కమిషనర్ చల్లా ఓబులేసు!
Kurnool: స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర (సాసా) ద్వారా కర్నూలు నగర పరిశుభ్రతకు సరికొత్త రూపు వచ్చిందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
Kurnool: 'సాసా'తో కర్నూలు స్వచ్ఛతకు సరికొత్త రూపు కమిషనర్ చల్లా ఓబులేసు!
Kurnool: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర (సాసా) కార్యక్రమం ద్వారా నగర స్వచ్ఛతకు సరికొత్త రూపు సంతరించుకుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. శనివారం ‘సాసా’ కార్యక్రమంలో భాగంగా జోహరాపురం కేసీ కెనాల్ బండ్ (పాకెట్ పార్క్) వద్ద మొక్కలు నాటారు. అనంతరం కేసీ కెనాల్‌లో గుర్రపుడెక్క తొలగింపు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఒక అంశంతో శుభ్రతకు నాంది పలుకుతుండటంతో నగరంలో సమూలమైన మార్పులు కనిపిస్తున్నాయన్నారు. ఈ నెల మూడో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉన్నందున నాలుగో శనివారం సాసా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కేసీ కెనాల్‌లో దట్టంగా పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించేందుకు హిటాచీకి ప్రత్యేకంగా రింగ్ తయారు చేయించి, 10 ట్రాక్టర్లతో యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎస్‌ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ పవన్ కుమార్ రెడ్డి, కృష్ణలత, సానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు, ఇన్‌స్పెక్టర్లు శివశంకర్, హుస్సేన్, టీఏఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




