Nandyal: కృష్ణమ్మ గర్భంలోకి సంగమేశ్వరాలయం.. వేపదారు శివలింగానికి జలాభిషేకం!

Nandyal: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సప్త నది సంగమేశ్వరాలయం కృష్ణా నది వరద ఉధృతికి జలాధివాసంలోకి వెళ్లింది.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 1 Aug 2026 7:32 PM IST
Nandyal
X

Nandyal: కృష్ణమ్మ గర్భంలోకి సంగమేశ్వరాలయం.. వేపదారు శివలింగానికి జలాభిషేకం!

నంద్యాల: దేశంలోనే అత్యంత అరుదైన.. వేద కాల .. ప్రాచీన చారిత్రక.. ఇతిహాస నేపథ్యమున్న అరుదైన క్షేత్రం.. తీర్థం సప్త నది సంగమేశ్వరం. కలియుగంలో సప్తనిధి సంగమేశ్వరుడు కృష్ణవేణి నదీమతల్లి గర్భంలో జలాధివాసం అవుతాడని శ్రీశైలం స్కంద పురాణ ప్రవచనం మేరకు ఈ ఏడాది ఆలయం కృష్ణ నది వరద జలాలకు జలాధివాసంలోకి పయనమవుతుంది.

నంద్యాల జిల్లా నల్లమల కృష్ణా నది తీరంలో వెలసిన సప్త నది సంగమేశ్వర క్షేత్రాన్ని కృష్ణా జలాలు చుట్టు ముడుతున్నాయి. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద జలాలు సంగమేశ్వరం నుంచి శ్రీశైల జలాశయానికి పరుగులు పెడుతున్నాయి.

మహారాష్ట్ర, కర్ణాటక నుంచి 1,53,000 క్యూసెక్కుల వరద జలాలు సంగమేశ్వర గర్భాలయంలోకి చేరి ధర్మరాజు ప్రతిష్టించిన వేపదారు శివలింగాన్ని ముంచెత్తాయి.ప్రతి ఏడాది కృష్ణవేణి నదీమతల్లి సంగమేశ్వర ఆలయాన్ని జలాధివాసంలోకి చేర్చుకునే శాశ్రోక్త ఆనవాయితీ ఈ ఏడాది కూడా కొనసాగింది.

ఆలయ వేద పండితులు తెలకపల్లి రఘురామ శర్మ వేప దారు శివలింగానికి సప్త నది జలాభిషేక క్రతువులు చేస్తుండగాని ధర్మాలయంలో వేప దారు శివలింగాన్ని కృష్ణ వరద జలాలు ముంచి వేశాయి.

ఆలయ పశ్చిమ ద్వారంలో ఆసీనుడైన భారీ ఏకశిల భీమ లింగ నందీశ్వరున్ని, పంచ క్షేత్ర శివలింగాలను వరద జలాలు అభిషేకించాయి.ఆలయ సంప్రదాయ పరంపరలో భాగంగా సప్త నజీమా తల్లులకు చీర సరే, చేటల వాయనం సమర్పించారు.

సప్త నదులు జలాలతో పరవాలు తొక్కుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు సుభిక్షంగా పంటలు పండేలా.. ఆశీర్వదించమని వేద పండితులు సప్త నది జనాలకు మహా మంగళహారతి నివేదించారు.

జలాధి వాసా .. జయ మంగళం .. అంటూ వేద పండితులు గర్భాలయ సంగమేశ్వరుడికి వీడ్కోలు పలికారు.ప్రతి గంటకు కృష్ణా నది వరద ప్రవాహం పెరిగి సప్త నది సంగమేశ్వర క్షేత్రాన్ని చుట్టుముడుతో శ్రీశైలం వైపు పయనిస్తున్నాయి.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story