Markapuram: మంత్రి పర్యటనలో ఉద్రిక్తత వెలిగొండ నిర్వాసితుడి ఆత్మహత్యాయత్నం
Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన వేళ తీవ్ర ఉద్రిక్తత. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుడు ఆత్మహత్యాయత్నం, బాధితుల ధర్నా.
Markapuram: మంత్రి పర్యటనలో ఉద్రిక్తత వెలిగొండ నిర్వాసితుడి ఆత్మహత్యాయత్నం
Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కలెక్టరేట్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో సుంకేసుల గ్రామానికి చెందిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుడు రామా ఏడుకొండలు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
డబుల్ ఎంట్రీ పేరుతో తనకు పరిహారం ఇవ్వలేదని, పరిహారం చెల్లింపులో తనకు అన్యాయం జరిగిందని ఏడుకొండలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆయనను అడ్డుకున్నారు. అనంతరం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఏడుకొండలతో మాట్లాడి సమస్యపై ఆరా తీశారు.
మరోవైపు మంత్రి నిమ్మల రామానాయుడు కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగా బయట వెలిగొండ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని, ఇప్పటికే నష్టపోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుండా మరోసారి నీటిలో ముంచొద్దంటూ బాధితులు నినాదాలు చేశారు.




