Tippayapalem: గేదెను తప్పించబోయి.. పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు!

Tippayapalem: మార్కాపురం సమీపంలో ప్రైవేట్ బస్సు ప్రమాదం. గేదెను తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 8 Jun 2026 1:21 PM IST
Tippayapalem
X

Tippayapalem: గేదెను తప్పించబోయి.. పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు!

మార్కాపురం జిల్లా: తిప్పాయపాలెం పోరుమామిళ్ల నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం రాత్రి మార్కాపురం మండలం తిప్పాయపాలెం సమీపంలో ప్రమాదానికి గురైంది. రోడ్డుపైకి వచ్చిన గేదెను తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రహదారి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా బస్సు పొలాల్లోకి వెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్సును బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story