Markapuram: మార్కాపురంలో ప్రైవేట్ స్కూల్ టీచర్ ఉరివేసుకుని ఆత్మహత్య!
Markapuram: మార్కాపురం కొండేపల్లి రోడ్డులో విషాదం. ప్రైవేట్ స్కూల్ టీచర్ నూర్జహాన్ ఉరివేసుకుని ఆత్మహత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Markapuram: మార్కాపురంలో ప్రైవేట్ స్కూల్ టీచర్ ఉరివేసుకుని ఆత్మహత్య!
Markapuram: మార్కాపురం పట్టణంలోని కొండేపల్లి రోడ్డులో విషాద ఘటన చోటుచేసుకుంది. నూర్జహాన్ (30) అనే వివాహిత మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మృతురాలు స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఆమెకు 11 సంవత్సరాలు, 6 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




