Nandyal: బనగానపల్లె డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌పై బదిలీ వేటు!
Nandyal: తీవ్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లలితపై ఉన్నత విద్యాశాఖ బదిలీ వేటు. శ్రీకాకుళం జిల్లాకు మార్పు.
Nandyal: బనగానపల్లె డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌పై బదిలీ వేటు!
Nandyal: తీవ్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. లలితపై ఉన్నత విద్యాశాఖ బదిలీ వేటు వేసింది ఆమెను శ్రీకాకుళం జిల్లా తొగరాం డిగ్రీ కాలేజీకి బదిలీ చేస్తూ విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెపై శాఖాపరమైన విచారణ కూడా పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.
సిబ్బంది బదిలీలకు రూ. 10 వేలు, గెస్ట్ ఫ్యాకల్టీ బిల్లులకు పర్సంటేజీలు, రిటైర్మెంట్ ఫైళ్లకు లంచాలు డిమాండ్ చేశారని ప్రిన్సిపాల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఫోన్‌పే లావాదేవీల స్క్రీన్‌షాట్లు వైరల్ కావడంతో బాధితులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను ప్రిన్సిపాల్ కొట్టిపారేశారు.
మరోవైపు, కళాశాలలో ఖాళీగా ఉన్న 15 రెగ్యులర్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యాసంస్థకు పూర్వవైభవం తేవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.




