Tripurantakam: నకిలీ ఎరువులు అమ్మితే జైలుకే.. త్రిపురాంతకంలో జాయింట్ కలెక్టర్

Tripurantakam: ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు త్రిపురాంతకం మండల కేంద్రంలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 21 May 2026 1:50 PM IST
Tripurantakam
X

Tripurantakam: నకిలీ ఎరువులు అమ్మితే జైలుకే.. త్రిపురాంతకంలో జాయింట్ కలెక్టర్

త్రిపురాంతకం: మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, పురుగు మందుల దుకాణాలను జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందుతున్నాయా లేదా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన, దుకాణాలలో స్టాక్ వివరాలు, విక్రయ రికార్డులు, లైసెన్సులు, బిల్లుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా దుకాణదారులతో మాట్లాడిన జాయింట్ కలెక్టర్, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని సూచించారు. రైతులను మోసం చేసే విధంగా నకిలీ లేదా గడువు ముగిసిన ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి విక్రయానికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, స్టాక్ రిజిస్టర్లు ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. రైతులు కూడా ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసే సమయంలో బిల్లులు తీసుకోవాలని, అనుమానాస్పద ఉత్పత్తులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ తనిఖీలలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు మరియు సంబంధిత శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story