Peddadornala: పెద్దదోర్నాలలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు!

Peddadornala: గ్లోబల్ కోచింగ్ సెంటర్‌లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన త్యాగాలను స్మరించుకున్నారు.

Srikanth Singam, Markapur
Published on: 4 July 2026 4:40 PM IST
Peddadornala
X

Peddadornala: పెద్దదోర్నాలలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు!

పెద్దదోర్నాల: పట్టణంలోని గ్లోబల్ కోచింగ్ సెంటర్‌లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్‌లో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్వాతంత్ర్య సమరంలో చేసిన పోరాటాలు, గిరిజనుల హక్కుల కోసం సాగించిన ఉద్యమం, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రదర్శించిన ధైర్యసాహసాలను స్మరించుకున్నారు.

అల్లూరి సీతారామరాజు యువతకు ఆదర్శప్రాయుడని, దేశభక్తి, త్యాగనిరతి, నాయకత్వ లక్షణాలకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బి. అరుణ, ఎస్.కె. హుస్సేన్ బాషా, వి. వెంకట రెడ్డి, వై.వి. అభిలాష్ రెడ్డి, పి. మల్లికార్జునతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story