Dornala: పెద్దదోర్నాల మండలం ఓటర్ల అవగాహన సదస్సు

Dornala: ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామంలో ఓటర్ల సమగ్ర సర్వే అవగాహన సదస్సు జరిగింది.

Srikanth Singam, Markapur
Published on: 11 July 2026 12:55 PM IST
Dornala
X

Dornala: పెద్దదోర్నాల మండలం ఓటర్ల అవగాహన సదస్సు

Dornala: మార్కాపురం జిల్లా.. పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామంలో ఓటర్ల సమగ్ర సర్వే (ఎన్యూమరేషన్) కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి వెలుదండ నాగేశ్వరరావు, బీఎల్ఓ రామయ్యతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి వెలుదండ నాగేశ్వరరావు మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామంలో గత 15 రోజులుగా ఓటర్ల సమగ్ర సర్వే కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. ప్రతి ఓటరు తమకు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపి సంబంధిత బీఎల్ఓలకు అందజేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితమైన వివరాలు నమోదు కావాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉందని, గ్రామంలోని ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వ్యక్తిగత వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోటోలు తదితర సమాచారాన్ని సకాలంలో అందించాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటిదని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

అలాగే కొత్తగా ఓటు హక్కుకు అర్హులైన యువత తమ పేర్లను నమోదు చేసుకోవాలని, చిరునామా మార్పులు, పేరు సవరణలు లేదా ఇతర మార్పులు ఉన్నవారు వెంటనే బీఎల్ఓలను సంప్రదించాలని తెలిపారు. గ్రామ ప్రజలందరూ సహకరించి సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామ సచివాలయ సిబ్బంది, బీఎల్ఓలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story