Pattikonda: రైతులకు 40 శాతం రాయితీపై వేరుశనగ విత్తనాలు

Pattikonda: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో రైతులకు 40% రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీని ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ (శ్యాంబాబు) ప్రారంభించారు.

G Jagadeesh, Pathikonda
Published on: 17 Jun 2026 11:00 AM IST
Pattikonda
X

Pattikonda: రైతులకు 40 శాతం రాయితీపై వేరుశనగ విత్తనాలు

Pattikonda: పత్తికొండ పట్టణంలోని రైతు సేవ కేంద్రం మూడులో రైతులకు సబ్సిడీ వేరుశనగ మరియు యూరియా డి ఏ పి ని, కే.ఈ. శ్యాంబాబు చేతుల మీదుగా విత్తన పంపీణి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది .

ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఎమ్మెల్యే కేఈ శాంబాబు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు విత్తనాల సరఫరాయే ప్రభుత్వ లక్ష్యం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత అని సరైన సమయంలో రైతులకు విత్తనాలు ఎరువులు అందించడం చాలా సంతోషకరంగా ఉందని తెలపడం జరిగింది. అదేవిధంగా ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతులకు పంటలకు సరిపడు ఎరువులు ఇవ్వడం వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందని అన్నారు.

ఏ పంటకు ఏ ఎరువులు వేయాలో ఎంత మోతాదులో వేయాలో రైతులకు సులువుగా తెలుసుకోవడంలో చాలా ఉపయోగంగా ఉందని మరియు రైతులు అధిక మోతాదులు ఎరువులు వాడకుండా పంట పెట్టుబడి తగ్గించే విధంగా ఈ APAIMS యాప్ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ APAIMS యాప్ ద్వారా ఎరువులు పక్కదారి పట్టకుండా నేరుగా రైతులకు అందే విధంగా రైతులకు మేలు జరుగుతుందన్నారు.

వేరుశనగ విత్తనాల కోసం రైతు సేవా కేంద్రాలలో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నారు.పత్తికొండ మండలం పరిధిలోని అన్ని రైతు సేవ కేంద్రాలలో కదిరి-k6 రకం వేరుశనగ మరియు TCGS 1694 రకం విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఒక క్వింటాల్ ధర రూ.10,200 కాగా,

అందులో 40% రాయితీ రూ.4,080 ప్రభుత్వం అందిస్తోంది మిగిలిన మొత్తం 6120 రూపాయలు రైతు చెల్లించాలి. వేరుశనగ విత్తన కేటాయింపు పత్తికొండ వ్యవసాయ శాఖ సబ్ డివిజన్లోని మండలాల వారీగా పత్తికొండ మండలానికి 1353 క్వింటాళ్లు తుగ్గలి మండలానికి 1750 క్వింటాళ్లు మద్దికేర మండలానికి 750 క్వింటాళ్లు వెల్దుర్తి మండలానికి 1853 క్వింటాళ్లు వేరుశనగ విత్తనాన్ని కేటాయించడం జరిగిందని చెప్పడం జరిగింది.రైతులు ఆధార్ కార్డును మరియు, పొలం పాస్ బుక్కు పత్రాలను మరియు ఇతర అవసరమైన ధ్రువపత్రాలతో రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పత్తికొండ సబ్ డివిజన్ వ్యవసాయ సంయుక్త సంచాలకులు ఏ డి ఏ మోహన్ విజయ్ కుమార్ పత్తికొండ తుగ్గలి మద్దికేర మండలాల వ్యవసాయ అధికారులు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు మూడు మండలాల రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొనడం జరిగింది. రైతులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story