Pattikonda: పత్తికొండలో సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అవగాహన సదస్సు!

Pattikonda: కర్నూలు జిల్లా పత్తికొండ ఎంపీడీవో కార్యాలయంలో మహిళల భద్రత, సైబర్ నేరాలు, మోసపూరిత కాల్స్‌పై విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు.

G Jagadeesh, Pathikonda
Published on: 18 Aug 2026 6:58 PM IST
Pattikonda
X

Pattikonda: పత్తికొండలో సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అవగాహన సదస్సు!

పత్తికొండ: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, సైబర్ నేరాలు, అక్రమ కార్యకలాపాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పత్తికొండ MPDO కార్యాలయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ సీఐ, MPDO, EORD, డిప్యూటీ MPDOతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

IVRS మోసపూరిత కాల్స్, మహిళలపై నేరాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, క్రికెట్ బెట్టింగ్, అక్రమ కార్యకలాపాలు, ప్రజా భద్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.నేరాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్‌, సందేశాలు, ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

మహిళలపై నేరాలు లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరిగినప్పుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసే విధానాన్ని వివరించారు.శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నివారణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, నేరాలపై సమాచారం అందించాలని సూచించారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story