Kurnool: నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలు

Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి. నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రిన్సిపాల్ డాక్టర్ నాగస్వామి.

V RAMAMOHAN, KURNOOL
Published on: 19 Aug 2026 7:56 PM IST
Kurnool
X

Kurnool: నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలు

కర్నూలు: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O. డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం, ఆయన ధైర్యసాహసాలు, దేశభక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నేతాజీ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

నేతాజీ ఆశయాలను నేటి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధిలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. దేశం పట్ల ప్రేమ, క్రమశిక్షణ, ధైర్యం, సేవాభావం వంటి విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఘన నివాళులు అర్పించారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story