Markapuram: మార్కాపురంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!
Markapuram: మార్కాపూర్ డీడీ పీటీ కాంప్లెక్స్‌లో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ అటవీశాఖ అధికారుల ఘన నివాళులు.
Markapuram: మార్కాపురంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!
Markapuram: జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపూర్‌లోని శ్రీ డీడీ పీటీ కాంప్లెక్స్‌లో అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అటవీ సంరక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తూ కలప స్మగ్లర్లు, అడవి జంతువుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బంది అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
మార్కాపూర్ డివిజన్ అటవీశాఖ అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, ఏపీ జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ మార్కాపూర్ యూనిట్ సభ్యులు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలను భగవంతుడు చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణ కోసం అమరవీరులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ FRO మార్కాపూర్ ఎస్. పిచ్చిరెడ్డి గారు, GV పల్లి FRO సూర్యనారాయణ గారు, A.O. చంద్ర మౌళి గారు, DYROలు జి. నాగరాజు గారు, శివ శంకర్ గారు, సాయి కుమార్ గారు, శ్రీనివాస్ గారు, డివిజన్ సిబ్బంది మరియు ఔట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.




