Nandyal: నంద్యాల టు న్యూఢిల్లీ: సాయి సన్నిహిత్ రెడ్డి సక్సెస్ స్టోరీ.. యువతకు ఆదర్శం!
Nandyal: నంద్యాల జిల్లాకు చెందిన అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ సాయి సన్నిహిత్ రెడ్డికి జాతీయ స్థాయి అవార్డు లభించింది.
Nandyal: నంద్యాల టు న్యూఢిల్లీ: సాయి సన్నిహిత్ రెడ్డి సక్సెస్ స్టోరీ.. యువతకు ఆదర్శం!
నంద్యాల జిల్లా: ఎన్‌ఫోర్స్‌మెంట్ డే–2026 నంద్యాల యువ అధికారికి జాతీయ స్థాయి అవార్డు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డే–2026 వేడుకలు న్యూఢిల్లీలోని భారత మండపంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విభాగానికి విశిష్ట సేవలు అందించిన అధికారులను సత్కరించారు. ఈ సందర్భంగా నంద్యాలకు చెందిన అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ శ్రీ కె.వి.ఎల్ సాయి సన్నిహిత్ రెడ్డి జాతీయ స్థాయిలో విశిష్ట అవార్డును అందుకున్నారు. ఆయన అత్యుత్తమ సేవలు, కృషి మరియు కట్టుబాటుకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు.
భారత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ నవీన్, స్పెషల్ డైరెక్టర్ మనూ టెంటివాల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిన్న వయసులోనే విభాగంలో చేరి, కేవలం మూడేళ్లలోనే జాతీయ స్థాయి గౌరవాన్ని అందుకోవడం సాయి సన్నిహిత్ రెడ్డి ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం ఆయన చెన్నైలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
వారి తండ్రి కే. చంద్రశేఖర్ రెడ్డి కర్నూలు, నంద్యాల జిల్లాల అడల్ట్ ఎడ్యుకేషన్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, తల్లి సుధా కుమారి ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా సాయి సన్నిహిత్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దేశ ఆర్థిక వ్యవస్థ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి నిబద్ధత, నిజాయితీ వల్లే ఈ సంస్థ విశ్వసనీయత పెరుగుతోందని తెలిపారు.
అధికారులు ఆయన పనితీరును అభినందిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ అవార్డు కార్యక్రమం ఉద్యోగుల్లో మరింత ఉత్సాహాన్ని పెంపొందించిందని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవార్డు గ్రహీతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.




