Nandyal: నంద్యాల బస్టాండ్‌లో మహిళ బ్యాగ్ నుంచి నగలు చోరీ

Nandyal: నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో రూ.6 లక్షల విలువైన బంగారు నగలు అపహరణ. రద్దీని ఆసరాగా చేసుకున్న ఆగంతకుడు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసుల గాలింపు.

R Pavankalyan, Nandyal
Published on: 17 July 2026 3:57 PM IST
Nandyal
X

Nandyal: నంద్యాల బస్టాండ్‌లో మహిళ బ్యాగ్ నుంచి నగలు చోరీ

నంద్యాల జిల్లా: నంద్యాల ఆర్టీసీ బస్టాండులో చోరీ ఘటన కలకలం రేపింది. బస్సు రద్దీని ఆసరాగా చేసుకున్న ఓ ఆగంతకుడు మహిళ బ్యాగ్‌లో ఉన్న రూ.6 లక్షల విలువైన బంగారు నగలను అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నంద్యాల ఆర్టీసీ బస్టాండులో ఓ మహిళ చోరీకి గురైంది. గడివేముల మండలం బిలకలగూడూరుకు చెందిన సరస్వతి రెండు రోజుల క్రితం దిగువమెట్టలోని తన పుట్టింటికి వెళ్లింది. తిరిగి అత్తగారింటికి వెళ్లేందుకు నంద్యాల ఆర్టీసీ బస్టాండులో నందికొట్కూరు వెళ్లే బస్సు ఎక్కింది.

బస్సులో తీవ్ర రద్దీ ఉండటాన్ని గమనించిన ఓ ఆగంతకుడు ఆమె బ్యాగ్‌ను లక్ష్యంగా చేసుకుని అందులో ఉన్న సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు నగలను అపహరించాడు.

కొద్దిసేపటి తర్వాత బ్యాగ్ తెరిచి ఉండటాన్ని గమనించిన సరస్వతి నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించింది. వెంటనే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story