Nandyal: పోలీసులకు హెల్త్ క్యాంపులు, నిరాశ్రయులకు హోమ్‌లెస్ సెంటర్లు!

Nandyal: నంద్యాలలో రెడ్ క్రాస్ సర్వసభ్య సమావేశం. సేవలను విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్పీ సునీల్ షోరాణ్ పిలుపు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 Aug 2026 4:44 PM IST
Nandyal
X

Nandyal: పోలీసులకు హెల్త్ క్యాంపులు, నిరాశ్రయులకు హోమ్‌లెస్ సెంటర్లు!

Nandyal: జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేసి, ప్రజలకు మెరుగైన మానవతా సేవలు అందించే దిశగా ముమ్మరంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా తెలిపారు.

శనివారం మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెడీ క్రాస్ సొసైటీ వారి వార్షిక సర్వ సభ్య సమావేశంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గణియా, జిల్లా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS..

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన జిల్లా గా ఏర్పడిన సమయంలో రెడ్‌క్రాస్ సొసైటీకి సొంత భవనం, బ్లడ్ స్టోరేజ్ యూనిట్ వంటి మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి నుంచి ప్రస్తుతం అనేక సేవలను అందించే స్థాయికి తీసుకురావడం జరిగిందన్నారు.

వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పాత జపాన్ ప్రాజెక్టు భవనాన్ని రెడ్‌క్రాస్ సొసైటీకి కేటాయించి, అవసరమైన ఆధునీకరణ పనులు చేపట్టి సొంత భవనంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.ప్రజలకు అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా ఫ్రీజర్లు, ఏసీలు, ల్యాబ్ టెక్నీషియన్ తదితర సదుపాయాలతో బ్లడ్ స్టోరేజ్ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రక్తదానంపై యువత, మహిళల్లో విస్తృత అవగాహన కల్పిస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

రెడ్‌క్రాస్ భవనానికి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు NEDCAP మార్గదర్శకత్వంలో పూర్తి స్థాయి సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు* . ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉండేలా GGH ఆవరణలో స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తల సహకారంతో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.

డోన్, శ్రీశైలం ప్రాంతాలతో పాటు NH-40, NH-340C జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ కొత్తగా బ్లడ్ స్టోరేజ్ యూనిట్లు, జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, అవయవదాన ప్రాముఖ్యతపై విస్తృత అవగాహనకల్పించాలన్నారుఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌వో కుటుంబాలకు అవయవదానం ద్వారా లభించిన ప్రయోజనాలతో పాటు ప్రభుత్వ బీమా పథకం ద్వారా సుమారు రూ.1 కోటి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అన్నారు.

రైల్వే స్టేషన్ పరిసరాల్లోని నిరాశ్రయులు, యాచకులకు ఆశ్రయం కల్పించేందుకు MEPMA, స్వచ్ఛంద సంస్థల సహకారంతో నైట్ షెల్టర్లను రెడ్‌క్రాస్ పర్యవేక్షణలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు సభ్యత్వాలను పెంచాలని, జిల్లాలోని పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు రెడ్‌క్రాస్‌తో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ప్రజల ప్రాణాలను కాపాడే రక్తదానం, అవయవదానం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ, వైద్య శిబిరాలు, ఆరోగ్య సేవలు వంటి కార్యక్రమాల్లో రెడ్‌క్రాస్ మరింత చురుకైన పాత్ర పోషించాలని తెలిపారు .

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ. సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మానవతా సేవా కార్యక్రమాలను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహిస్తుందని తెలిపారు. రక్తదాన శిబిరాల నిర్వహణ, విపత్తుల సమయంలో బాధితులకు సహాయక చర్యలు అందించడం, అత్యవసర సమయాల్లో ప్రజలకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాల్లో రెడ్‌క్రాస్ సంస్థ చేరువుగా ఉందన్నారు.

రెడ్‌క్రాస్ సొసైటీకి జిల్లా కలెక్టర్ నిరంతరం ఆర్థికంగా, పరిపాలనాపరంగా అన్ని విధాలా మద్దతు, సహకారం అందిస్తున్నారని జిల్లా ఎస్పీ అభినందించారు. జిల్లా యంత్రాంగం సహకారంతో నంద్యాల జిల్లాలో రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించేందుకు అవకాశం ఉందన్నారు. ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా జన్ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయనీ ఇటువంటి ప్రజా ఉపకార కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని అన్నారు.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఫుట్‌పాత్‌లపై రాత్రి వేళల్లో ఆశ్రయం లేకుండా ఉంటున్న వృద్ధులు, నిరాశ్రయుల కోసం ప్రత్యేకంగా హోమ్‌లెస్ సెంటర్‌ (ఆశ్రయ కేంద్రం) ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

ఈ కార్యక్రమానికి జిల్లాలోని దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవడంతో పాటు జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.పోలీసు సిబ్బందికి రెగ్యులర్ మెడికల్ క్యాంపులు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తూ, అనేక సందర్భాల్లో సరైన సమయానికి ఆహారం తీసుకోలేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు అవసరమన్నారు .

రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి క్రమం తప్పకుండా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా వారి విధి నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందన్నారు.

రెడ్‌క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల, సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి గార్లు మాట్లాడుతూ గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు అందించిన విలువైన సలహాలు, సూచనలను తప్పకుండా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. “తక్కువ ప్రసంగాలు – ఎక్కువ సేవా కార్యక్రమాలు” అనే లక్ష్యంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రెడ్‌క్రాస్ సభ్యులు, వాలంటీర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి డాక్టర్ అరుణ కుమారి గారు 2024 25 సంవత్సరాలలో 2025 26 సంవత్సరాలలో రెడ్క్రాస్కు అందిన నిధులు వాటికి పెట్టిన ఖర్చుల వివరాలు, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి అన్నిటిని సభ్యులకు, అతిధులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ మమతారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మారుతి కుమార్, ఉస్మాన్ భాష, డాక్టర్ నిషిత రెడ్డి, యాకూబ్, సురేంద్ర, నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాల్లో రక్తదాన శిబిరాల్లో ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ తదితర అవగాహన సదస్సులో పాల్గొని విశేష సేవలు అందించిన పలువురికి జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story